దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని యాడికి టీడీపీ మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, మాజీ ఎంపీపీ రంగయ్య అన్నారు. యాడికి మండల కేంద్రంలో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినదించారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.