వెల్గటూరు: కిషన్ రావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెల్లూరు రాంచందర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.