రాజేంద్రనగర్: మహేశ్వరంలో గ్లోబల్ సమ్మిట్ పనులు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి
తెలంగాణ రైజింగ్ - 2025 భాగంగా డిసెంబర్ 8,9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పనులను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. రోడ్లు విస్తరణ, మరమ్మతులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.