కుప్పం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. మృతురాలు గాయత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గాయత్రికి 13 ఏళ్ల క్రితం కుప్పం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్న యువరాజ్ తో వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.