కణేకల్లు మండల కేంద్రంలో పప్పుశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. బుధవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి, ఎమ్మెల్యే తనయుడు కాలవ భరత్, పలువురు అధికారులు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి క్వింటాలు రూ.5875 ధరతో కొనుగోలును ప్రారంభించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయరాం చౌదరి, మండల కన్వీనర్ వన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.