యాడికి మండల కేంద్రంలోని శివాలయం ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను పంచాయతీ అధికారులు సోమవారం తొలగించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగింపుకు చర్యలు తీసుకున్నారు. శివాలయం రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. శివాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జే సీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.