ధర్మపురి: పెన్షన్ ల పెంపు కోసం ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన...
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్ దారుల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెందోలి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ₹6,000, చేయూత పెన్షన్ దారులకు ₹4,000 పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. వాటితో పాటు ఇతర పెన్షన్ లను సైతం పెంచుతామని చెప్పిన హామీ ఇచ్చిన వాటిని ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.