తోట్లవల్లూరు మండలం గురువిందపల్లిలో ఎమ్మెల్యే కుమార్‌రాజా వ్యవసాయ పనులు ప్రారంభించారు. చేనులో దమ్ము చేసి, పూజలు నిర్వహించారు. రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని కుమార్ రాజా ఆకాంక్షించారు.