అసిఫాబాద్: చిన్న బెండర గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి
వాంకిడి మండలం చిన్న బెండర గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..వాంకిడి మండలం ఖమన గ్రామానికి చెందిన నాగోషే విజయ్ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. నిన్న రాత్రి బెల్లంపల్లి నుంచి ఖమన వెళ్తుండగా చిన్న బెండర సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమవారం సాయంత్రం ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.