అసిఫాబాద్: తూనికాకుల సేకరణ పెండింగ్ డబ్బులు చెల్లించాలి: బాధితుడి ఆరోపణ
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో తునికాకు సేకరణ జరిగి 360రోజులైనా కూలీలకు రావాల్సిన డబ్బులలో సగం డబ్బులే వచ్చాయని బాధితుడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆరోపించాడు. 2016 నుండి 2021 వరకు రావలసిన బోనస్ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదని ఆరోపించారు. మాకు రావాల్సిన డబ్బులను సంబంధిత అధికారులు స్పందించి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.