సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. కార్యాలయాలకు వచ్చే రైతులు, బాధితులతో ఆయన మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన అన్నారు