వికారాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి: డీఎంహెచ్‌వో పాల్వన్ కుమార్
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రతి మంగళవారం సేవలు అందుబాటులో ఉంటున్నాయని, త్వరలో వారంలో రెండు రోజులు సేవలు అందుతాయని పేర్కొన్నారు. వ్యాధి బారిన పడిన మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా సకాలంలో చికిత్స పొందితే రోగం తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.