నగరంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ స్వప్న
Anantapur Urban, Anantapur | Nov 18, 2025
అనంతపురంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం, అలాగే కార్తీక వనభోజనం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మూడో రోడ్డులో ఉన్న జి ఆర్ ఫంక్షన్ హాలులో వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ స్వప్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి కర్రి బసవ రాజేంద్ర స్వామి హాజరయ్యారు. లింగాయత్ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ స్వప్న ఆధ్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించారు.