వెల్గటూరు: సమస్యపై స్పందించి సూరారం- పాతగూడూర్ సరిహద్దులో సూచిక బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
ఎండపల్లి మండలం సూరారం- పాతగూడూర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలో నిర్మించిన సూచిక బోర్డు చెట్టుపై ఒరిగి కింద పడిపోయింది. దీంతో ఈ సమస్య సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారు వెంటనే సూచిక బోర్డుకు మరమ్మతులు చేయించి శుక్రవారం మధ్యాహ్నం ఉపయోగంలోకి తీసుకొని వచ్చారు.