నిడమానూరు: నిడమనూరు మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో వినతి
నల్లగొండ జిల్లా నిడబనూరు మండలంలోని సూరేపల్లి వల్లభాపురం ఎర్రబెల్లి గ్రామాలలో మొదటి విడతలు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను వెంటనే ప్రకటించి వారికి న్యాయం చేయాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నిడమానూరు ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పలువురు మాట్లాడుతూ ఇందిర మహిళల లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ప్రొసీడింగ్ పత్రాలను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీను ,శేఖర్, శివ, కేశవులు ,సైదులు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.