హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫూల్‌బాగ్ ప్రాంతంలో ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ షమ్రుద్దీన్ అలియాస్ ఆమర్ (32) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంట్లోని కుటుంబ సభ్యులు పెళ్లి కార్యక్రమానికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.