సూళ్లూరుపేటలో స్టే హైజెనిక్ పరిశుభ్రత కార్యక్రమం
స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో స్టే హైజెనిక్ వ్యక్తిగత సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వార్డులలో మొక్కలు నాటడం, పిచ్చి మొక్కల తొలగింపు ప్రత్యేక వీధి శుభ్రత పనులు చేపట్టారు. ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ డిగ్రీ కాలేజీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన వాతావరణం నెలకొంటుందని వక్తలు తెలియజేశారు.