పాణ్యం: కల్లూరు అర్బన్ 41వ వార్డులో అయ్యప్ప స్వామి మహాపడి పూజకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి హాజరు
కల్లూరు అర్బన్ 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో సుతారు రాఘవేంద్ర (కత్తి స్వామి/కన్యస్వామి) లిఖిత్ గారి ఇంటిలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, యువ నాయకుడు గౌరు జనార్ధన్ రెడ్డి, కమ్మరి పార్వతమ్మ, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూజ, అభిషేకాలు అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.