సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధించాలన్న నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధించాలని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు. మంగళవారం తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. గ్రామపంచాయితీలలో పారిశుద్ధ్యన్ని, మెరుగుపరిచి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూచించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రహదారులు, ఆలయాలు, పాఠశాలల్లో మొక్కల పెంపకం చేపట్టి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకొని సమన్వయంతో పని చేసి అభివృద్ధి సాధించాలని తెలియజేశారు. ఈ కార