నేలకొండపల్లి: ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ద్విచక్రవాహనం డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనం డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.పోలీసులు రాత్రి 9 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం....మండలంలోని ఆరెంపుల గ్రామానికి చెందిన అరికట్ల వీరబాబు తనద్విచక్రవాహనంపై ఖమ్మం నుంచి ఆరెంపులు వెళ్తుండగా మార్గమధ్యలో పొన్నెకల్లు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది.దీంతో వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యలో మృతి చెందినట్లు సిఐ రాజు తెలిపారు.