కళ్యాణదుర్గం: అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నాం: కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్
మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ అన్నారు. కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఎక్కడపడితే అక్కడ , ఎవరు పడితే వారు ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినా లేదా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.