నేరాల నియంత్రణకు పాత బిల్డింగులు, శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచిన ప్రకాశం జిల్లా పోలీసులు
Ongole Urban, Prakasam | Jan 18, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాలను నియంత్రించడం మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడం లక్ష్యంగా ఆదివారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని పాత, పాడుబడిన బిల్డింగులు, అలాగే శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు మరియు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఈ నిఘా ద్వారా నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.