రాయచోటి తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈ నెల 7న సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పార్టీ నేతలు మావులూరి విశ్వనాథ్, ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. పేదలకు ప్రభుత్వ హామీలు నెరవేరడం లేదని, మైక్రో ఫైనాన్స్ దెబ్బతో వారు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. విద్య, ఉపాధి, రుణమాఫీ వంటి అంశాలపై కూడా ప్రభుత్వాన్ని మందలించారు.