నెల్లిమర్ల: ఈనెల 24న సింగవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభ: భోగాపురంలో కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి
ఈనెల 24న నెల్లిమర్ల నియోజకవర్గంలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి వెల్లడించారు. మంగళవారం ఆమె భోగాపురంలో విలేకరులతో మాట్లాడారు. డెంకాడ మండలం సింగవరం స్టేట్ బ్యాంక్ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న నియోజకవర్గంలోని జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.