కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో రైతు కురబ ఎర్రప్ప తోటలోకి సోమవారం ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. పొలంలో ఉన్న వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భయంతో పరుగులు తీశారు. చాలాసేపు ఎలుగుబంటి తోటలో హల్చల్ చేసింది. గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి తోటలో నుంచి బయటికి వెళ్లి పోయింది. ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు, చిరుతల సంచారం అధికమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.