వైసీపీ సోషల్ మీడియాలో తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ ఆరోహణరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లికార్జున తో పాటు పలువురు మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాలో తమపై ఇష్టానుసారం కొందరు మాట్లాడడం జరిగిందన్నారు. వారందరిని గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.