గుత్తిలోని గాంధీ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే లారీల ముందర భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో స్థానికులే ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.