శ్రీకాకుళం: రాష్ట్ర పండుగగా ప్రకటించిన రథ సప్తమికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
రాష్ట్ర పండుగగా ప్రకటించిన అరసవిల్లి రథ సప్తమి వేడుకలను జిల్లా సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రథ సప్తమి పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అరసవిల్లి రథ సప్తమి వేడుకలు జిల్లా ప్రతిష్టను పెంచుతాయని కనుక పండుగ విజయవంతానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు.