కంబదూరు మండలం గుద్దిళ్ళ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత వడ్డే రేణుక(30) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కలహాలు నెలకొన్నాయి. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.