అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ,25తులాల బంగారం చోరీ
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం కవిత ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ. 15 లక్షల నగదు, 25 తులాల బంగారం అపహరణకు గురైనట్లు బాధితుడు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, డాగ్ స్కాడ్ బృందంతో తనిఖీలు చేస్తున్నారు.