ఇంటర్మీడియట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నందున అధికారులతో ఆయన సోమవారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు, జిల్లాలోని పరిస్థితిని ఆర్ఐఓ ఆంజనేయులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వేల మది విద్యార్థుల భవిష్యత్తు ప్రధానమన్నారు