కంబదూరులో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ బిల్లే ప్రభాకర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను ఎన్టీ రామారావు అన్ని విధాల అభివృద్ధి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అమర్ రహే ఎన్టీఆర్ అమర్రకే అంటూ నినాదాలు చేశారు.