అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లిన ఆత్మకూరుకు చెందిన చిరంజీవి అనే భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు కొండపై నుంచి కింద పడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.