సిర్పూర్ టి: దరోగపల్లి గ్రామంలో సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మతులు చేయించిన బిజెపి నాయకుడు హరీష్
పెంచికల్పేట్ మండలంలోని దరోగపల్లి గ్రామ రైతులు చేర్ల లోకి వెళ్లే రోడ్డు మార్గం అకాల వర్షాల కారణంగా దెబ్బతినడంతో గమనించిన బిజెపి నాయకుడు హరీష్ తన సొంత ఖర్చులతో రోడ్డును బాగు చేయించాడు. పొలాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని బాగు చేయించడంతో హరీష్ కు రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. హామీలు ఇచ్చినా నాయకులు నెరవేర్చకపోయినా ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వీరాభిమానిగా ఉంటూ హరీష్ గ్రామానికి రోడ్డు మార్గం బాగు చేయడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు,