సంతనూతలపాడు లో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు వచ్చిన యువతను మరియు టిడిపి శ్రేణులను ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరుపేరునా అభినందించారు. రక్తదానం ఒక గొప్ప కార్యక్రమం అని, రక్తదానంపై ఉన్న అపోహలను ప్రతి ఒక్కరు విడనాడి రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న సాటి మనిషి ప్రాణాన్ని రక్షించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.