భద్రాచలం: భద్రాచలంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు
సేవ్ భద్రాద్రి అధ్వర్యంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించడం అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. బుధవారం కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తో పాటు వారి సతీమణి ప్రవీణ హాజరై శంకుస్థాపన చేశారు. సేవ్ భద్రాద్రి అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు , వరదల సమయంలో ముంపు ప్రాంత ప్రజల సేవకు ఉపయోగిస్తామని తెలిపారు.