సంగారెడ్డి: కవలం పేటలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆఫీసర్లు కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేటలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఉదయ్ కుమార్ రాకేష్ లు పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు పనిచేయాలని అభ్యర్థులు ఖర్చు పెట్టే ప్రతి పైసాను లెక్క చూపాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.