పాల్వంచ: చదువు మనిషికి మూడో నేత్రం చదువు లేకుంటే జీవితం అంధకారం: డీసీఎంసి చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల
చదువు మనిషికి మూడో నేత్రం అని, చదువు లేకుంటే జీవితం అంధకారం అని డీసీఎంసి చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుఅన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభం సందర్భంగా ప్రవేశాల పోస్టర్ ను కొత్వాల ఆవిష్కరించారు. శ తెలంగాణా ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే 2024-25 విద్యా సంవత్సరపు ప్రవేశాల పోస్టర్ ను స్థానిక మార్కెట్ ఏరియాలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ చదువుపై ఆసక్తి వుంది, వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి, ఇది సువర్ణ అవకాశం అన్నారు.