స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి సతీమణి కాంతాకుమారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.