కంబదూరు మండలం గుద్దిళ్ళ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గంగన్న చౌదరి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు, జడ్పీటీసీ నాగరాజు, సర్పంచ్ బాపూజీ తదితరులు ఆదివారం గుద్దిళ్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ గంగన్న చౌదరి మృతదేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. సంతాపం ప్రకటించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.