అసిఫాబాద్: పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గోర్ సేనా రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం ASF కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.. పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదని, అధిక వర్షాలతో పంట నష్టం జరిగిందన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని,12శాతం తేమ నుంచి29 శాతం వరకు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.