హనుమంతునిపాడులో ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ఉపాధి కూలీలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోమస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేస్తూ, రాష్ట్రాలపై భారం మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా ఉపాధి కూలీలకు తీరని అన్యాయం జరుగుతుందని, వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలన్నారు