ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యా బోధన అందుతుందని.. తల్లిదండ్రులు తమ బిడ్డల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. కుప్పం మండలంలోని కంగుంది పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. పిల్లలు చదువులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిసారించి ఎప్పటికప్పుడు పాఠశాలకు వచ్చి ఆరా తీయాలని సూచించారు.