చీపురుపల్లి: ముగిసిన నామినేషన్లు ప్రక్రియ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 13 అభ్యర్థుల నుంచి 24 సెట్లు దాఖలు
2024 సార్వత్రిక ఎన్నికలు తొలి ఘట్టం నామినేషన్లు ప్రక్రియ ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పదముగ్గురు అభ్యర్థుల నుంచి 24 నామినేషన్ సెట్లు దాఖలు అయ్యాయి. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ అలాగే బొత్స తనయుడు బొత్స సందీప్ నామినేషన్లు వేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు తో పాటు ఆయన తనయుడు రామ్ మల్లిక్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే బిఎస్పి. కాంగ్రెస్ పార్టీ లతో పాటు ఇండిపెండెంట్ కలుకుని మొత్తం 24 నామినేషన్ సెట్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 26 వ తేది ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలన కార్యక్రమం ఉంటుంది