సిర్పూర్ టి: జనవాసాల మధ్య ఉన్న మద్యం షాపును తొలగించాలని ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన మహిళలు
కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్, పంచశీల నగర్ లో జనవాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళలు ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సోమవారం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణం ముందు నుండే గుడులకు, పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. డిసెంబర్ ఒకటవ తేదీన అదే స్థలంలో మళ్లీ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేస్తామని సిపిఎం పార్టీ నాయకుడు ఆనంద్ కుమార్ హెచ్చరించారు,