అసిఫాబాద్: ఉట్నూర్ ధర్మ యుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఈనెల 23న ఉట్నూరులో నిర్వహించనున్న ధర్మ యుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజ్ గోండు సేవ సమితి జిల్లా కార్యదర్శి గుణవంత్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు తిర్యాణి మండల కేంద్రంలోని కొమురం భీం చౌరస్తా వద్ద బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. చట్టబద్ధత లేని లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్‌తోనే ఈనెల 23న బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు