పెద్దపప్పూరు మండలం చిన్న పప్పూరులో వెలసి ఉన్న శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి క్షేత్రంలో అశ్వర్ధ నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ ఆదివారం విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అశ్వర్థ నారాయణస్వామి, చక్ర భీమ లింగేశ్వర స్వాములకు విశేష పూజలు చేశారు. క్షీరాభిషేకాలు, పాలాభిషేకాలు, అర్చనలు, అభిషేకాలు వంటి విశేష పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.