అసిఫాబాద్: ఆసిఫాబాద్ లో ఘనంగా ఐక్యత యాత్ర ర్యాలీను ప్రారంభించిన ఎంపీ నాగేష్
ఉక్కు మనిషి'సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ASF కలెక్టరేట్ లో 'యూనిటీ మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ నాగేష్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వేదికపై పటేల్, భరతమాత చిత్రపటాలకు ఎంపీతోపాటు కలెక్టర్ వెంకటేష్ దోత్రేలతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వల్లభభాయ్ పటేల్ చూపిన మార్గంలో యువతకు ముందుకు వెళుతూ,దేశ ఐక్యతకు పాటుపడాలని అన్నారు. 'ఏక్ భారత్.. అత్మనిర్భర్ భారత్' నినాదం దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తెస్తుందన్నారు.