దిత్వా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి హెచ్చరిక
దిత్వా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి సూచించారు. ఆదివారం సాయంత్రం వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో పర్యటించి చెరువులు ,కుంటలు, బావులను పరిశీలించి అక్కడి పరిస్థితులను అంచనా వేసి సిబ్బందితో చర్చించి జాగ్రత్త చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించి తుఫాను సందర్బంగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తన ఫోన్ నెంబర్ 9440796714 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.