కుప్పం: రైతు గ్రూపుల ఏర్పాటుపై అవగాహన
శాంతిపురం మండలంలో రైతు గ్రూపుల ఏర్పాటుకు సంబంధించి వెలుగు, ఉపాధి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏఎంసీ ఛైర్మన్ జీఎం రాజు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పథకాలను రైతులకు అందించేందుకు ఈ గ్రూపులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.